కొందుర్గు పోలీస్ స్టేషన్ కు మొగిలిగిద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు తరలింపు

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు


జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31:

మొగలిగిద్దలో బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు ఉన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అదే విధంగా మొగలిగిద్ద మండల ఏర్పాటు అంశంలో పెద్ద ఎత్తున అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులను ఏకకాలంలో అదుపులోకి తీసుకుంటున్నారు. కొంతమందిని అరెస్టు చేసి షాద్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించగా మరికొంతమందిని కొందూర్గు పోలీసు స్టేషన్ కు తరలించారు. తరలించిన వారిలో మొగలిగిద్ద గ్రామానికి చెందిన అనుమారి రాజు, గుట్ట ప్రశాంత్, ఎల్లంపల్లి సాయి, గుర్రంపల్లి ఆంజనేయులు తదితరులు ఉన్నారు,

You may also like...

Translate »