మెహదీపట్నం డిపో బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ నిండు ప్రాణం బలి

మెహదీపట్నం డిపో బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ నిండు ప్రాణం బలి

  • రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన రోడ్డు దాటుతున్న వ్యక్తి
  • రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతికి ఆర్టీసీ డ్రైవర్ రాష్ డ్రైవింగే కారణం అంటున్న స్థానికులు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఆర్టీసీ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన శంకర్ పల్లి మండలంలోని, బుల్కాపూర్ గ్రామ శివారు రాఘవేంద్ర స్వామి గుడి సమీపంలో జరిగింది. మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెంబర్ TS 07 1413 బుధవారం సాయంత్రం మెహిదీపట్నం నుండి శంకర్ పల్లి కి వస్తూ, బుల్కాపూర్ గ్రామ శివారు రాఘవేంద్ర స్వామి గుడి సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దాదాపు 6 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మెహదీపట్నం నుండి శంకర్ పల్లి కి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చూసినా చాలా రేష్ గా వెళుతుంటాయని పాదచారులు ఏమాత్రం ఏమరపాటు వహించిన ప్రాణాలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు. రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతికి ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగే కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి బీహార్ కు చెందిన వలస కూలీ అని తెలుస్తుంది,పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...

Translate »