సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు విజయవంతం

సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు


  • కార్తీక మాసం పురస్కరించుకొని
  • సామాజిక సమరసత ఆధ్వర్యంలో శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలోని
  • సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
  • కార్యక్రమంలో పాల్గొన్న 132 కుటుంబాలు

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
సామాజిక సమరసత ఆధ్వర్యంలో శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డిఎంఆర్ గార్డెన్స్ లో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 132 కుటుంబాలు, వివిధ గ్రామాల భక్తుల చేత పూజారులు పవన్ పంతులు పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ సామాజిక సమరసత కన్వీనర్ అప్పల ప్రసాద్ జి గారు మాట్లాడుతూ కులాలకతీతంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి కుటుంబంలో తమ పిల్లలకు భక్తి కథలు చెప్పాలి అని మాతృమూర్తులకు తెలియజేశారు.
టీవీ సీరియల్ చూడడం మానేసి కుటుంబ బలోపేతం కోసం తల్లి తండ్రులు వారితో ప్రేమగా మసలు కోవాలని కోరారు. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పిల్లల చేత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అని పలికించారు.

కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, ఇతర సభ్యులు సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ దామోదర్ రెడ్డి, శంకర పల్లి సమరసత సభ్యులు కవ్వగూడెం శ్రీను, లక్మా రెడ్డి, నందు, RSS కార్యకర్తలు తీగుళ్ళ నర్సింలు, నరసింహ రెడ్డి, అచ్చిరెడ్డి, నాగిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, జయరాం రెడ్డి, మహేందర్ రెడ్డి,గోపాల్, అచ్చిరెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

You may also like...

Translate »