72 గంటలు డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం చేయండి

– PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ


జ్ఞానతెలంగాణ,చేవెళ్ళ ప్రతినిధి : PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చేవెళ్ల పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వద్ద జూలై 2,3,4 వ తేదీలలో జరగబోయే 72 గంటల బందును విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి .శ్రీనివాస్ మాట్లాడుతూపెండింగ్ లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి అనితెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద ,విద్యార్థులు విద్యకు దూరమైతున్నారని అంతేగాక డిగ్రీ, పీజీ చదువుకున్న విద్యార్థులు పై తరగతికి వెళ్లాలంటే ఇటు ప్రభుత్వ యజమాన్యం అటు ప్రైవేటు యజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజు మొత్తం కట్టించుకుని ఇస్తున్నారని ఇందువల్ల ఫీజు కట్టలేని పేద విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని రాను రాను ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నాయని అందులోని భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా పాలన కొనసాగిస్తుందని నీరు పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని లక్ష్యంతో పాలకవర్గాలు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ కళాశాల విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »