స్థానికులకు ఉపాధి కల్పించాలి

స్థానికులకు ఉపాధి కల్పించాలి
- శ్యామ్ రాజు అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ మాజీ ఉపాధ్యక్షులు
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
చేవెళ్ల మండలం కందవాడ గ్రామ ప్రాంతంలో స్పిన్ మాక్స్ టైర్స్ కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పెద్దయెత్తున భూసేకరణలు జరిగాయని సీనియర్ న్యాయవాది గౌండ్ల కృష్ణ ఆరోపించారు. అభివృద్ధి,ఉపాధి అంశాలపై ఎన్నో చర్చలు జరిగాయని, భూములు కోల్పోయిన స్థానికులకు ప్రతి ఇంటికి ఉపాధి కల్పిస్తామని గ్రామ నాయకులు మాటిచ్చారు.నిజమే మన గ్రామం, మన బ్రతుకులు మారుతాయానుకున్నారు,మార్కెట్ ధర కంటే దాదాపు మూడు నాలుగు రెట్లు తక్కువ ఇచ్చి 4 గ్రామాల్లో భూములు తీసుకున్నారు.స్పిన్ మాక్స్ టైర్స్ యాజమాన్యం స్థానికులకు ఏ ఒక్కరికి ఉపాధి కల్పించకపోగా, యాజమాన్యం స్పిన్ మాక్స్ కంపెనీ లో పనిచేసేందుకు లేబర్ ను బీహార్ మరియు యూపీ, ఒడిస్సా నుండి తెప్పించకుని స్థానికులకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడం లేదని
కంపెనీ యజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటర్ లిస్టులో అక్రమాలపై ఆర్డీవో కు ఫిర్యాదు
బీహార్, యుపి ఒడిస్సా, నుండి వచ్చిన వాళ్ళ పేర్లు కందవాడ గ్రామ ఓటర్ జాబితాలో నమోదు చేశారని గ్రామస్తులు శుక్రవారం స్థానిక ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదు చేశారు.
అసలు బీహార్,యూపీ,ఒడిశా,వాళ్లకు కందవాడ గ్రామానికి ఎలాంటి సంబంధం లేకయినా వాళ్ల పేర్లను ఓటర్ లిస్టులో ఎక్కించడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు ఆర్డీవో ని, ఎమ్మార్వో ని కలిసి ఓట్ల జాబితాలోని బీహార్ యూపీ వాళ్ళ పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మెమొరండం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గౌండ్ల కృష్ణ గౌడ్, రాయిని శ్యామ్ రాజ్, బండ కన్నా, నేరిగే సంజీవ, రవి, శ్రీకాంత్, బాలయ్య,,నరేష్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

— లోకరాజు ,జ్ఞాన తెలంగాణ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి