ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేద్దాం

  • మహేశ్వరంకి 28న మందకృష్ణ మాదిగ గారి రాక
  • శివశంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
  • ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ చేవెళ్ల మండల అధ్యక్షులు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి, 25:

మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేవెళ్ల మండల అధ్యక్షుడు ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలో సమావేశం నిర్వహించి నూతన కమిటి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివ శంకర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలనే డిమాండ్ తో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన జరగబోతుంది.
ఈ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల 28 రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహేశ్వరం మండల్ కేంద్రంలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహాక మహా ప్రదర్శన జరుగుతుంది.ఈయొక్క ప్రదర్శనకు మహాజన నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు కావున మాదిగలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు డప్పుతో కదలి రావాలని వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీ అద్యక్షులు గా శివగల్ల విజయ్, ఉపాధ్యక్షుడు గా బోనగిరి కృష్ణ,ప్రధాన కార్యదర్శి గా బోనగిరి బిక్షపతి, కార్యదర్శి గా మోనగొల్ల రామకృష్ణ, అధికార ప్రతినిధి గా శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు భీమయ్య , బాల్ లింగం,సత్యం తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »