బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో స్వేరోస్ జాతీయ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ

బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో స్వేరోస్ జాతీయ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ
- స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైలారం జగన్ స్వేరో
జ్ఞానతెలంగాణ ,హైదరాబాద్ : రంగా రెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, బాలాపూర్ గ్రామం లో ఈ నెల 27 న సిద్దిపేట జిల్లా, బెజ్జంకి లో జరిగే స్వేరోస్ జాతీయ మహాసభ యొక్క గోడ పత్రికలను బాలాపూర్ స్వేరో సర్కిల్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఆవిష్కరించడం జరిగింది.అక్షరం ఆరోగ్యం ఆర్థికం ప్రధాన అజెండాగా డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు స్థాపించిన సంస్థ స్వేరోస్ నెట్వర్క్. గత ఎనిమిది సంవత్సరాలుగా బాలాపూర్ స్వేరో సర్కిల్ నుండి ఉత్తమ కమాండర్స్ సహాకారం తో ఎంతో మంది విద్యార్థులకు చదువుతో పాటు గా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సమాజం పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను వివిధ రకాల గురుకులాల్లో పంపడం జరిగింది. గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం తల్లిదండ్రులకు స్వేరో సర్కిల్ లో జరిగే అంశాలపై అవగాహన కల్పిస్తూ 27 న జరిగే
స్వేరోస్ జాతీయ మహాసభ ను విజయ వంతం చేస్దాం అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాపూర్ స్వేరో సర్కిల్ మైలారం జగన్, కమాండర్స్ ప్రీతి, మౌనిక, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నాడు.
