గతంలో రాజకీయ లబ్ధి కోసం మంఖల్ ని మండలం కాకుండా అడ్డుకున్నారు

  • చరిత్ర కలిగిన మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి
  • మంఖల్ మండల కేంద్రం గా అందరికీ అందుబాటులో ఉంటుంది
  • రెవెన్యూ పరంగా రవాణా పరంగా కమర్షియల్ పరంగా అనుకూలంగా మంఖల్
  • రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్

మహేశ్వరం, జనవరి 16, (జ్ఞాన తెలంగాణ):

మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలని
రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుందని ముఖ్యంగా రవాణా పరంగా ఆర్థికంగా రెవెన్యూ పరంగా కమర్షియల్ పరంగా ఏ విధంగా చూసినా మంఖల్ గ్రామాన్ని మండలం గా ప్రకటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఫ్యూచర్ సిటీ దృష్టిలో పెట్టుకొని మంఖల్ చుట్టు ఔటర్ రింగ్ రోడ్ ఉండడం పక్కనే కూత వేటు దూరంలో ఏర్పాటు ఇటు ఫ్యాబ్ సిటీ హాట్ హార్డ్ వేర్ పార్కు ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందని పరిపాలన పరంగా కూడా చాలా బాగా ఉంటుందని ఆయన అన్నారు. 1985లో ముఖ్యమంత్రి గా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. అప్పుడు మంఖల్ గ్రామాన్ని ప్రత్యేక మండలం గా గుర్తించి మండలంగా చేసే క్రమంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం మంఖల్ గ్రామాన్ని మండలం కాకుండా అడ్డుకున్నారు.చరిత్ర పరంగా చూసిన మంఖల్ గ్రామానికి చరిత్ర ఉందని అధికంగా రెవెన్యూ కలిగిన గ్రామం అని మంఖల్ మహేశ్వరం అంటేనే ఇప్పటికీ హైదరాబాద్ వారికీ తెలుస్తుందని అన్నారు. కావున మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మంఖల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించే సమయంలో కొంతమంది కుట్ర చేసి మంఖల్ కాకుండా మహేశ్వరాని మండలం గా చేశారని అదేవిధంగా మంఖల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసే సమయంలో కూడా సెంటు భూమి రెవెన్యూ లేని తుక్కుగూడను మున్సిపల్ గా చేశారని ఇలా ప్రతిసారి మంఖల్ గ్రామానికి అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతిసారి ఏదోరకంగా రాజకీయంగా అడ్డుపడుతూ గ్రామానికి అన్యాయం చేశారని ఇకనైనా నాయకులు అధికారులు గుర్తించి మంఖల్ గ్రామానికి మండలంగా ప్రకటిస్తే అభివృద్ధితోపాటు అందరికీ అనుకూలంగా ఉంటుందని అద్భుతమైన ప్రగతి జరుగుతుందని మరోసారి మంఖల్ గ్రామానికి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తూ మంఖల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మంఖల్ గ్రామ పంచాయతీ పరిధిలో తుక్కుగూడ ఒక వార్డుగా ఉండేదని అలాంటి మంఖల్ గ్రామాన్ని అన్యాయం చేస్తూ ఎక్కడ మంఖల్ గ్రామం పేరు లేకుండా చేస్తున్నారని చరిత్ర కలిగిన మంఖల్ గ్రామాన్ని చరిత్రలో లేకుండా చేస్తున్నారని నర్సింగ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి మంఖల్ గ్రామానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారులు నాయకులు ఆలోచన చేసి మంఖల్ గ్రామానికి మండలంగా ప్రకటించాలని నర్సింగ్ రాజ్ కోరారు.

You may also like...

Translate »