రంగారెడ్డి జిల్లా బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి”
హైందవశక్తి తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బిర్లంగుడాలోని శ్రీ కీర్తన ఫౌండేషన్ లో ఉంటున్న వారికి శుక్రవారం రోజున వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాతల సహాయ సహకారాలతో మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని “హైందవశక్తి” ఆశిస్తున్నది. ఈ సందర్భంగా మాకు తమ సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ మన “హైందవశక్తి” ప్రత్యేక కృతజ్ఞతాభి వందనాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన “హైందవశక్తి” ఫుల్ టైమర్ మెండి.స్వప్న ట్రాన్సిలేటర్ మెండి.పంకజ్ కృష్ణ కృషి ఎంతైనా అభినందనీయం