రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

- రైతులకు రైతు భరోసా నిధులు బే షరతుగా ఇవ్వాల్సిందే
- రైతు భరోసా ఇవ్వకపోతే నిరసన కార్యక్రమాలు తప్పవు
- తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :
రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ లోని జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు రాజ్యం ప్రజారాజ్యం ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రైతుల పట్ల మొండి వైఖరి అనుసరిస్తుందని ఈ వైఖరిని వీడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల రైతుల పట్ల అవలంబిస్తున్న తీరు బాధాకరమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ను నిలిపివేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్థామన్నారు.. శంషాబాద్ పట్టణ మండల రైతులకు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు భరోసా రైతులకు సకాలంలో రాకపోతే రైతులందరిని సంఘటితం చేసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు డిసిసిపి డైరెక్టర్ మాచర్ల మోహన్ రావు, ఫాక్స్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ భూర్కoట సతీష్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, నర్కుడ గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
End