దసరా సందర్భంగా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు వెల్లువ

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03:
దసరా పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం దసరా పండుగను పురస్కరించుకొని సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి నీరటీ తన్విరాజు ముదిరాజ్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ పదాధికారులు, ఫ్యాక్స్ చైర్మన్ లతో డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, వార్డు సభ్యులు తో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల క్షేమమే ధ్యేయంగా శ్రమించే నాయకులు ప్రజల మనిషి ఈ ప్రకాష్ గౌడ్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అన్ని కార్యక్రమాల్లో విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పార్టీ నాయకులు నీళ్ల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »