సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
శంకర్పల్లి మున్సిపాల్టీ సింగాపురం వార్డులో గల శివాలయంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ శనివారం వైభవంగా జరిగింది. పడిపూజ కన్నె స్వామి ముత్యం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురుస్వామి మడపతి చంద్రమౌళి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి భక్తి గీతాలు ఆలాపించారు. శివాలయం మొత్తం అయ్యప్ప స్వామి నామ స్మరణతో మారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముత్యం రాజమణి రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
