జ్ఞాన తెలంగాణ,శంకేర్పల్లి : శంకర్పల్లి మండల కేంద్రమైన ప్రధాన కూడలి చౌరస్తా యందు ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గద్దర్ గారి జయంతి జరిగింది ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజనసంఘం సీనియర్ ఉపాధ్యక్షులు బండారి బాలకిషన్ మాట్లాడుతూ సామాజిక విప్లవ ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల కై పీడిత తాడితులకు శ్రామికుల కొరకై తన కాలికి గజ్జ కట్టి భారత దేశంలోనే తన ఆటపాటలతో కళ్ళకు కట్టినట్టు ప్రజా సమస్యల పై పోరుబాటను సలిపి అనేకమైన ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా సామాజిక తెలంగాణకై ముందుండి పోరాడిన ప్రజాయుద్ధనౌక గద్దరని, గద్దర్ గారీ ఆయన చిత్రపటానికి పూల మాలను వేసి, క్యాండిల్స్ వెలిగించి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని అన్నారు ఇందులో పాల్గొన్న వారు ఉపాధ్యాయులు బి రాములు, ప్రేమ్ కుమార్, మాణిక్యం, బాలరాజు, బిఎడ్ కాలేజీ లెక్చరర్ అనంతయ్య, కానిస్టేబుల్ విటల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోడి లింగమయ్య, మైసన్న గారి వెంకటేష్, కటికే ఆనంద్, స్టేషన్ జంగయ్య విద్యార్థులు పాల్గొన్నారు