మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్ నగర్ ప్రతినిధి, జనవరి 16:
రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం వెలి జర్ల గ్రామానికి చెందిన కప్పేరి సత్తయ్య మృతిచెందిన సమాచారం అందుకున్న వెంటనే కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని మిత్రుల ద్వారా పంపించారు అనూహ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ముందుండి సామాజిక సేవ చేస్తూ ఆదుకుంటున్న వ్యక్తిగా తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పేరు ప్రజల్లో విశేష గుర్తింపు పొందిందని పలువురు ప్రశంసించారు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలతో సేవలందించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోందని స్థానికులు కొనియాడారు,
