శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ ఎంపీటీసీబసగళ్ల రాములు గౌడ్ ప్రత్యేక పూజలు
జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :
శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ బసగళ్ల రాములు గౌడ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రమోద్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాలభైరవుడి దగ్గర దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు రాములు గౌడ్, అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు రాములు గౌడ్ ను శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి, జిల్లా బిజెపి కౌన్సిల్ సభ్యుడు వాసుదేవ్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు లీలావతి బయానంద్, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, యూత్ లీడర్ ప్రవీణ్ కుమార్, ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్ పాల్గొన్నారు.