సేవాలాల్ చూపిన బాటలో నడవాలి

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి
బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజాభివృద్ధికీ కృషి చేయాలని లక్ష్మి శ్రీనివాస్ టీఎస్ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీ ఎస్ ఎస్ ఓ ఆధ్వర్యంలో హైదరాబాద్ బండ్లగూడలో నిర్వహించినశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం లో సేవాలాల్ జయంతి వేడుకలను గురువారం గిరిజన నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారాలకే కాకుండా యావత్తు ఇతర జాతికి ఆదర్శ పురుషుడయ్యారుని అన్నారు. సేవాలాల్ మహరాజ్ బంజార జాతి పరువు ప్రతిష్టల కోసం అహింస సిద్ధాంతాలకు పునాది వేసి ఆచరించి చూయించిన మహనీయుడని అన్నారు. బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారనీ, సేవాలాల్ మహరాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుందని తెలిపారు. కులమత వర్గ విభేదాల పతీతంగా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మహనీయుల ఆశయాల అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు.చేసినటువంటి బంజారా హక్కుల కోసం పోరాడారు బంజారా ప్రజలంతా ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల మధ్యలో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఎస్ఓ డిమాండ్ చేయడం జరిగింది
అదేవిధంగా రాష్ట్రంలో ఎస్టీ హాస్టల్స్ ను అధిక సంఖ్యలో ప్రవేశపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ,టీఎస్ఎస్ఓ హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షులు క్రాంతి కుమార్ నాయక్, టీఎస్ఎస్ఓ హైదరాబాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.