శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సినీ నటిస్వాతిప్రియ ప్రత్యేక పూజలు

శంకర్‌పల్లి: అక్టోబర్ 27: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ నటి, మోడల్ స్వాతిప్రియ (మాస్ చిత్రం) స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం శివలింగానికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నారని స్వాతిప్రియ అన్నారు. అనంతరం ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి ఆమెను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ జనరల్ సెక్రెటరీ జనార్ధన్, సభ్యుడు హనుమంతు, అర్చకుడు ప్రమోద్ ఉన్నారు.

You may also like...

Translate »