పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకి నిలయాలు

గండిపేట గండి మైసమ్మ జాతర దర్శించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ గిరి ప్రభు.


జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, జనవరి 16, పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం గండిపేట లో గల గండి మైసమ్మ జాతర ఎంత వైభవంగా జరుగుతుందని గండిమైసమ్మ జాతరని శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్, సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి, భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పుణ్యపు ప్రభు, కావలి మల్లేష్, శ్రీనివాసచారి గండి మైసమ్మ జాతర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ మాట్లాడుతూ పండుగలు మన సాంప్రదాయానికి నిలయాలన్నారు. పండగల పరమార్థం ముక్తి మార్గమేనని ఆయన అన్నారు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకి అందజేయాలన్నారు. అన్యపు ప్రభు నర్రా గిరి మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని, పండగల ద్వారా ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందని తద్వారా ఈర్ష ద్వేషాలకు ఉండదన్నారు.

You may also like...

Translate »