ఇంటింటికి తిరిగి సభ్యత్వంనమోదును విసృతం చేయండి

ఇంటింటికి తిరిగి సభ్యత్వం నమోదును విసృతం చేయండి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాదే విజయం
- భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ గౌడ్
జ్ఞాన తెలంగాణ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 24 :
మల్కాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వం చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ గౌడ్ హాజరై సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి వార్డు మెంబెర్ లను,సర్పంచ్ లను, ఎంపిటిసి లను గెలుపుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు బిజెపి సభ్యత్వం స్వీకరించి నరేంద్రమోధీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో ముగుస్తుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి జిల్లా పార్టీకి అందించాలని కోరారు. పార్టీలో పదవులు రావాలంటే వ్యక్తిగతంగా 100 సాదారణ సభ్యత్వం చేయాల్సిందే అని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లలో రెండు వందల సభ్యత్వం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు శర్వా లింగం,ఇంద్రసేనారెడ్డి పెద్దోళ్ల కృష్ణ , మాణిక్యం వెంకటేష్,మాల్కాపూర్ గ్రామ భూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మల్లేష్, సీనియర్ నాయకులు శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది