ఊరేళ్ళ గ్రామాన్ని మున్సిపల్ లో కలుపొద్దు

ఊరేళ్ళ గ్రామాన్ని మున్సిపల్ లో కలుపొద్దు


చేవెళ్ల రెవేన్యూకు ఊరేళ్ల బహుదూరం.

అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాం.

మాజీ వైస్ ఎంపిపి కర్నె శివ ప్రసాద్

మాజీ సర్పంచ్ లు ఎండి జహంగీర్,ఉరడి నర్సింలు,


జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25:చేవెళ్ల మున్సిపల్ లో ఊరేళ్ల గ్రామాన్ని కలుపొద్దని, ఇది పూర్తిగా అశాస్త్రియమంటు మాజీ వైస్ ఎంపిపి కర్నె శివ ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ లు ఎండి జహంగీర్, ఉరడి నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ విట్టలయ్య, వార్డు మెంబెర్ చాను, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్యను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. శనివారం ఎమ్మెల్యే స్వగ్రామం చించెల్ పెట్ కు సుమారు ఐదు వందల మంది గ్రామస్తులతో కలిసి వెళ్లి ఈ మేరకు ఆయనకు విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఊరేళ్ల గ్రామం ఇంకా గ్రామీణ పల్లె వాతావరణం గానే ఉందన్నారు. 300 మంది ఉపాధి హామీ కూలీలు రోజు కూలీ పనులకు వెళ్తారన్నారు. మున్సిపల్ లో గ్రామం ను కలిపితే ఉపాధి హామీ పథకం గ్రామంలో రద్దవుతుందన్నారు మున్సిపల్ లో మా గ్రామాన్ని కలిపితే అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని తెలిపారు. పల్లేలకు వచ్చే ప్రత్యేక నిధులు ఆగిపోతయాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు విపరీతంగా పెరిగిపోతయాని వివరించారు. అదేవిధంగా ఊరేళ్ల గ్రామం చేవెళ్ల రెవెన్యూ కు చాలా దూరంగా ఉందని చెప్పారు. చేవెళ్లకు అత్యంత సమీపంలో ఉండి, రెవెన్యూ కలిసి ఉన్న మల్లారెడ్డి గుడా, కందవాడ, పల్గుట్ట, పామేన గ్రామాలను వదిలి మా ఊరేళ్ల గ్రామాన్ని మున్సిపల్ లో కలపడం సహేతుకంగా లేదన్నారు. మా గ్రామస్థుల అభిప్రాయాలు, మనోభావాలు గౌరవించాలని ఎమ్మెల్యే యాదయ్యకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మొండిగా ఊరేళ్లను మున్సిపల్ లో కలిపేందుకు ముందుకు వెళ్తే అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలకు దిగుతామని వారు పేర్కొన్నారు.

You may also like...

Translate »