శంకర్ పల్లి లో నివాసాల పక్కనే దహన సంస్కారాలు

ఎవరికీ వారు యదేచ్చగా కబ్జాలు
కులానికి కులానికి పెరుగుతున్న అంతరాలు
రిత్విక్ వెంచర్ ప్రక్కన రాజస్థానీ సమాజ్ స్మశానవాటిక
స్మశానవాటిక సమీపంలోనే ఇండ్ల సముదాయాలు
తీవ్ర ఆందోళన లో రిత్విక్ వెంచర్ ప్రజలు
ఇండ్ల పక్కనే శవాలను దహన సంస్కారాలు
దుర్వాసనతో రోగాల భారిన పడుతున్న నివాసితులు
చలనం లేని మున్సిపల్ కమిషనర్
స్పందించాలని అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్న స్థానికులు
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి,డిసెంబర్ ౩౦ :
శంకర్ పల్లి పట్టణంలో కులానికి ఒక స్మశానవాటికలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కులాల వారు స్మశానవాటికలను కబ్జా చేసుకుని వాటిల్లో తమ వారివే దహన సంస్కారాలు చేసుకుంటున్నారు. ఇతర కులాల వారిని ఆ స్మశాన వాటికలో రానీయడం లేదు. కాగా కొత్తగా ఒక స్మశాన వాటిక గొల్లవాగు ప్రక్కన ఏర్పాటు అవుతున్నది. రాజస్థానీ సమాజ్ వారు ఈ కొత్తగా స్మశాన వాటికను రిత్విక్ వెంచర్ ప్రక్కన నిర్మిస్తున్నారు. దీని సమీపంలోనే ఇండ్ల సముదాయాలు ఉన్నాయి. దీంతో రిత్విక్ వెంచర్ వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇండ్ల పక్కనే శవాలను దహన సంస్కారాలు చేస్తే ఆ దుర్వాసనను భరించలేమని వాపోతున్నారు. ప్రభుత్వం వారు ఇటీవలే స్మశాన వాటికలో కొత్త దహన సంస్కారాలు కొరకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్నవారు ఎవరైనా చనిపోతే అందులోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. కాగా కొత్తగా నిర్మిస్తున్న రాజస్థానీ సమాజ్ స్మశాన వాటిక పనులు మున్సిపల్ కమిషనర్ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

