ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం

జ్ఞాన తెలంగాణ, షాబాద్, అక్టోబర్ 5:


షాబాద్ మండల కేంద్రంలోని యూనిక్యూ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) శనివారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జానంపేట శివరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ… గత 14 సంవత్సరములుగా షాబాద్ మండల కేంద్రంలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు, ఇక్కడ కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకమైందని, ప్రతి రంగంలోనూ కంప్యూటర్ వాడకాన్ని మౌలిక అవసరంగా పేర్కొన్నారు. ఈ డిజిటల్ యుగంలో ఉద్యోగాలు పొందేందుకు, స్వయం ఉపాధి సాధించేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కంప్యూటర్ నైపుణ్యాలున్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. అందుకే యువత తప్పనిసరిగా ఈ విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఇది కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ సాధించాల్సిన నైపుణ్యం, అని ఆయన తెలిపారు. ఇనిస్టిట్యూట్ ద్వారా అందిస్తున్న సర్టిఫైడ్ కోర్సులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల యువత ఈ కోర్సులను వినియోగించుకొని ఉపాధి అవకాశాలు పొందగలరన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »