మీ కోసం వస్తున్నా

  • పూసలతండాలో వాటర్ ఫిల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,
  • మాట ఇచ్చిన ప్రకారం మంచినీరు.. వాగ్దానం చేసిన ప్రకారం భోజనం,

జ్ఞాన తెలంగాణ,షాద్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14:

ఎన్నికల సమయంలో పూసలతండా పర్యటనలో ఇచ్చిన మాటను గిరిజన పేద తండాకు నీటి కష్టాలను తెలుసుకొని అప్పుడే వారికి మంచినీటిని అందిస్తానని మాట ఇచ్చి నేడు చేతలలో చేసి చూపెట్టారు. అదే విదంగా తండాలో మహిళలకి అంగన్వాడీ భవనం, పాఠశాల మరియు రోడ్లకు తగినంతగా ప్రాధాన్యత ఇస్తానని నేడు మరొకమారు పేద ప్రజలందరికి మాట ఇచ్చారు. శంకరన్న మాట ఇస్తే పని అయినట్టేనని తాండ ప్రజలు మురిసిపోయారు. కార్యక్రమంలో శంకరన్న వాటర్ ఫిల్టర్ రిబ్బన్ కట్ చేసి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న తాండ మహిళకు మొదటిసారిగా మంచి నీళ్ల బిందెను అందించారు.. మరొక సందర్భంలో ఎంపీటీసీ రాజుతో మరియు మాజీ ఎంపీటీసీ శేఖర్లకు ఇచ్చిన మాట ఏమిటంటే డిప్యూటీ సర్పంచ్ రమేష్ పెళ్ళికి గతంలో హాజరుకాని పక్షంలో ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్న మాటని కూడా నెరవేరుస్తూ కార్యకర్తలందరితో కలిసి జొన్న రొట్టెలు తిని సంతోషంతో దంపతులీద్దరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం వెంకట్ రెడ్డి పల్లి మాజీ ఉప సర్పంచ్ రమేష్ ఆద్వర్యంలో జరిగింది.ఇట్టి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సులోచన క్రిష్ణరెడ్డి, ఆదివాసీ గిరిజన జిల్లా అధ్యక్షులు శ్రీనునాయక్, కంసానిపల్లి మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ శేఖర్ తాజా మాజీ ఎంపీటీసీ రాజు, వెంకటరెడ్డిపల్లి వార్డ్ సభ్యులు రమేష్, రాజు, సత్యం, లింగం, అల్లే లింగం, జీవన్రెడ్డి, సోమ్లా నాయక్, శంకర్, వహాబ్, మున్నా,యాదగిరి,మల్లయ్య,
అమ్జద్ గ్రామ ప్రజలు యువకులు మరియు మహిళలు పాల్గొన్నారు

You may also like...

Translate »