కన్నుల పండుగగా చెరుకూరి సురేంద్ర విఠల్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్

కన్నుల పండుగగా చెరుకూరి సురేంద్ర విఠల్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్


ప్రేక్షకులను కట్టిపడేసిన క్రీడాకారుల విన్యాసాలు

ట్రోఫీని కైవసం చేసుకున్న సదరన్ సునామీ జట్టు

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జాతీయ క్రీడాకారుడు జి ఆర్ కిరణ్

సుబిషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మండలం, పొద్దుటూరు గ్రామంలోని ఫాం హౌస్ లో చెరుకూరి సురేంద్ర విఠల్ స్మారకార్థం, సి ఎస్ విఠల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాకారులతో, వాలీ బాల్ టోర్నీ మెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. శని, ఆది వారాల్లో జరిగిన ఈ టోర్నమెంట్ లో ఎనిమిది జట్లకు, జాతీయ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. రెండు రోజులుగా ఎనమిది జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోరు ప్రేక్షకులకు కనువిందు చేస్తూ, కట్టిపడేశాయి. ఈ మెగా టోర్నీ లో చెన్నై సదరన్ సునామీ మరియు ముంబాయి జిఎస్టి జట్లు ఫైనల్ కు చేరాయి. ఈ రెండు జట్ల మధ్య బెస్ట్ ఆఫ్ త్రీ పద్దతి లో జరిగిన పోరులో మొదటి సెట్ ను 25-18 తో రెండవ సెట్ ను 25-20 తో వరుస సెట్ల ను గెలుచుకున్న సునామీ జట్టు, మరో సెట్ కు అవకాశం లేకుండా జయకేతనం ఎగురవేసింది. సదరన్ సునామీ జట్టు క్రీడాకారులు డిఫెండింగ్ లోను, స్పైకింగ్ లోను, ఆద్యాంతం పై చేయి సాధించారు. సునామీకి చెందిన స్పైకర్ నవీన్ కొట్టిన ఒక్క షాట్ ను కూడా జిఎస్టి ఆటగాళ్లు నిలువరించలేకపోయారు.

ఈ యొక్క టోర్నమెంట్లో మొదటి బహుమతి గెలుచకున్న సదరన్ సునామీ జుట్టు కు, లక్ష రూపాయల నగదు తో పాటు ట్రోఫీ, ద్వితీయ బహుమతి గెలుచుకున్న ముంబై జిఎస్టి కి ఏబది వేల నగదు మరియు ట్రోఫీ, తృతీయ స్థానంలో నిలిచిన రైల్వేస్ జట్టుకు ఇరవై అయిదు వేల నగతో పాటు ట్రోఫీ ని, బెస్ట్ స్పైకర్, బెస్ట్ డిఫెండర్ లకు పదివేల చొప్పున నగుదు బహుమతులను ముఖ్య అతిథి మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు డివిఎం ఆర్టీసీ టీజీ కిరణ్, సుబిషి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఛైర్మెన్ టి వేణుగోపాల్ రెడ్డి ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కొరకు, క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి, సి ఎస్ విఠల్ ట్రస్ట్ ఎల్లప్పుడు చేయూతనందిస్తుందని ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ అజయ్, ప్రశాంత్, వేణుగోపాల్ రెడ్డి మరియు శ్రీనివాస్ ఎలవర్తి అన్నారు.

ఈ కార్యక్రమానికి అంకుర హోమ్స్, సుబిషి, ఎస్ ఆర్ ఆర్, భువన గ్రూప్, ఎలిగాన్స్ గ్రూప్, పావర్టీ హ్యాండ్లింగ్, మైత్రి, ఎఫిజీఎంట్, ఐ రన్ హార్స్, తమ సహకారాన్ని అందజేయగా, చెరుకూరి సురేంద్ర విఠల్ ఎన్ఆర్ఐ యూ ఎస్ స్నేహితులు నగదు బహుమతులకు తమ సహకారాన్ని అందజేశారు. ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ కు తనవంతు సహకారం అందించి విజయవంతం చేసిన, సోషల్ యాక్టివిస్ట్ ఉపాధ్యాయులు ఆశీర్వాదం కు ట్రస్ట్ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

You may also like...

Translate »