చెర్లగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

- రూ.10 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మాణం
- గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- మాజీ ఉప సర్పంచ్ కండ్లపల్లి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేష్
జ్ఞాన తెలంగాణ,షాబాద్,ఏప్రిల్ 18:
షాబాద్ మండల కేంద్రంలోని చ చెర్లగూడ గ్రామములో శుక్రవారం నూతన సీసీ రోడ్లను రూ.10 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మాణం గ్రామస్తులతో కలసి ప్రారంభించినట్లు మాజీ ఉప సర్పంచ్ కండ్లపల్లి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ తనయుడు కౌకుంట్ల రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీనివాస్,మోహినూద్దీన్, గ్రామస్తులు జానంపేట శివరాజ్ గౌడ్,చొక్కంపేట ఆంజనేయులు, దేవరపల్లి అంజయ్య, కౌకుంట్ల భూపతి రెడ్డి, చొక్కంపేట రాజు, బలవంత్ రెడ్డి, లింగాల జంగయ్య, రాములు, నవీన్, కుమార్, ప్రవీణ్, శేఖర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.