ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ యువ నాయకులు పృద్వి రాజ్ ఫైర్

ప్రభుత్వం పై బి ఆర్ ఎస్ యువ నాయకులు పృద్వి రాజ్ ఫైర్
- భూమి,ఇల్లు ఇస్తే సరిపోతుందా?
- విద్యార్థి మృతికి కారణాలు అవసరం లేదా?
- ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా?
- ఒక అమ్మాయిని కాపాడలేని హాస్పత్రులు ఉండేం లాభం?
- ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి?_ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి?
- శైలజ / శ్రావ్య మృతి పై నిలదిస్తున్న విద్యార్థి,ప్రజా సంఘాలు.
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రూరల్, ప్రతినిధి నవంబర్ 28 :
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు కనికరం లేని ప్రభుత్వానికి ఇంకా ఎలా తెలియపరచాలి విద్యార్థులు చనిపోతున్నారు అని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం . మొన్నటికి మొన్న ఎల్.ఎల్.బి చదువుతున్నటువంటి విద్యార్థి శ్రావ్యని అనుమానస్పర్ధంతో మృతి చెందింది న్యాయవాదులుగా చదువుకున్న విద్యార్థులకు రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత , దానిపై ప్రభుత్వం ఇటువంటి స్పందన ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు పట్టించుకోవడం లేదు? శ్రావ్య అనే అమ్మాయి ఆదివారం రోజు ఆఫీస్ కి రమ్మని పిలిచి తర్వాత చూస్తే అమ్మాయి చనిపోయి ఉంది దానికి కారకులు ఎవరు దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి వాళ్ల కుటుంబానికి న్యాయం జరిగే వరకు బి ఆర్ ఎస్ పోరాటం ఆగదు. ఒకవైపు విద్యా వ్యవస్థకు న్యాయం చేస్తున్నామంటూనే మరోవైపు రోజుకో హాస్టల్,పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ తో విద్యార్థులు హాస్పిటల్ పాలవుతునే ఉన్నారు.అయినా అధికారులలో,ప్రభుత్వంలో మార్పులు రావడం లేదని చెప్పకనే చెప్పవచ్చు…ఈ మధ్య కాలంలో కొంతమంది విద్యార్థులు మృతి చెందిన ఘటనలు కోకొల్లలు.అలాంటి ఘటనలో భాగంగానే మొన్న ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి ఇందుకు ఉదాహరణ…
- వైద్యులు ఉన్నారా?
- పాలకులు ఎక్కడ?

గత నెల 28న ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం శైలజ విద్యార్థిని చేర్పించిన వాళ్లు సుమారు నెలరోజులు వరకు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందితే అసలు వైద్యులు ఏం చేస్తున్నారు?అధికారులు ఉన్నారా లేరా?పాలకులు ఉన్నారో లేదో అనే సందేహం ప్రతి ఒక్కరికి రాక మానదు.ఎందుకంటే ఒక అమ్మాయిని కాపాడుకోలేని వ్యవస్థ ఉండేం లాభం అనేది అటు విద్యార్థి,ప్రజా సంఘాలు,మానవ హక్కుల సంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యా శాఖ మంత్రి ఉన్నారా?
విద్యా వ్యవస్థలో ఇంత జరుగుతున్న గానీ నేటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక విద్యా శాఖ మంత్రి లేకపోవడమే వీటన్నింటికి కారణం అని ఇటు తల్లిదండ్రులు,అటు విద్యార్థి,ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల శవాలమీద శవ రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నిస్తూన్నారు.ఇప్పటికైనా విద్యా శాఖకు ప్రత్యేక మంత్రిని ఇచ్చి వ్యవస్థను కాపాడి, విద్యార్థుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఇక…