విప్లవ నిప్పుకణం భగత్ సింగ్

  • ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి
  • బేగరి అరుణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, మార్చి 23 :

చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ,దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయస్సు లో ఉరుకంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వీరుడు భగత్సింగ్ అని అన్నారు భగత్ సింగ్, సుఖ్ దేవ్,రాజగురులను బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా ఉరితీసిందని వారు మరణించిన అనంతరం యువతరం పెద్ద ఎత్తున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఈ దేశంలోని పేదల బడుగు బలహీనవర్గాల కోసం భగత్ సింగ్ సుగుదేవ్ రాజ గురులు ప్రాణాలు అర్పించారని అన్నారు తాను కలలు కన్నా స్వాతంత్రానికి విరుద్ధంగా ప్రస్తుత సమాజంలో పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ధనికులు వందల వేల కోట్లకు పడగలెత్తారని అన్నారు నాణ్యమైన విద్య వైద్యం దొరకక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని డబ్బులు ఉంటే తప్ప పేదలు చదువుకునే పరిస్థితి లేదని విద్య వైద్యం అంగడిలో సరుకుగా మారిందని అన్నారు భగత్ సింగ్ కలలుగన్న సంపూర్ణ స్వరాజ్యం ఇది కాదు అని అన్నారు పేదవాడికి ఉచిత విద్య ,వైద్యం అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు, సమీర్ ,చందు, మొయినాబాద్ మండల అధ్యక్షుడు చరణ్ గౌడ్, తేజ, మురారి, గాయత్రి ,శిరీష, మౌనిక, కవిత, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »