– శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం లో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం
–అన్నప్రసాద వితరణ గావించిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
– కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,
– బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరియు పట్టణ కౌన్సిలర్లు
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 03: 1
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు, హరిహర పుత్రుని ఆజ్ఞ లేనిదే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గావించే అదృష్టం లేదంటున్నారు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి. ఈరోజు షాద్ నగర్ పట్టణంలో స్థానిక శివ మారుతి అయ్యప్ప గీతా మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గావించారు. మండలం రోజులపాటు అత్యంత కఠిన దీక్షతో, అయ్యప్ప మాలలు ధరించి, ప్రతినిత్యము అయ్యప్ప స్వామి పూజలు గావించి, శ్రద్ధ శక్తులతో అయ్యప్ప స్వామిని సేవించి, క్షణక్షణం అనుక్షణం అయ్యప్ప స్వామిని మనుషులు తలుచుకునే అయ్యప్ప స్వాములకు ఒక్కరోజైనా అన్నప్రసాద వితరణ గావించే అదృష్టం తనకు దక్కిందని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హరిహర సుతుని ఆశీస్సులతో, చల్లని చూపులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆకాంక్షించారు. అయ్యప్ప స్వాములు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అన్న ప్రసాద వితరణ గావించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు రేటికల్ నందిశ్వర్, వెంకట్రాంరెడ్డి, జూపల్లి కౌశల్య శంకర్, ఈశ్వర్ రాజు, కానుగ అనంతయ్య, సుదీర్, మానస యాదగిరి, వావిలాల సుజీవన్, పిల్లి శేఖర్, అడ్డు ఎజాజ్, మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, కొందుర్గు బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ నర్సిమ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవిందర్ రెడ్డి, జంగిలి కుమార్, తదితరులు పాల్గొన్నారు.