అడ్వకేట్ గీత వనజాక్షి కి అభినందనల వెల్లువ

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) నియామకమైన పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ అడ్వకేట్ గీత వనజాక్షి ని సురంగల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి జవొజీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడమే కాకుండా ప్రజా సేవలో కూడ రాణిస్తున్న పేదల పక్షపాతి అడ్వకేట్ గీత వనజాక్షి గారిని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించడం చాలా సంతోషం అని అన్నారు. గత 20 సంవత్సరాలనుండి ఎన్నో వ్యయప్రయాసాలను మొక్కవోని ధైర్యంతో ఎదురుకుంటూ తన వృత్తికే వన్నె తెస్తున్న గీత అక్క గారు మహిళా లోకానికే ఆదర్శం అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో సోమ గోపాల్ యాదవ్, నోముల శేఖర్ యాదవ్, నాగిరెడ్డిగూడెం చంటి మాదిగ, పెద్దమంగలారం యాదగిరి జంగం, కనకమామిడి సందీప్, సురంగల్ సత్యం కర్రోళ్ల తరితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »