రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం కు అన్ని ఏర్పాట్లు సిద్ధం

డాక్టర్ వి విజయలక్ష్మి,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ


జ్ఞాన తెలంగాణ,కేశంపేట్ ప్రతినిధి 11:
అక్టోబర్ 12 ఆదివారం రోజున నిర్వహించే సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ దినోత్సవం లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, హనుమకొండ లో నిర్వహిస్తున్నారు అని, అందుకుగాను మన షాద్నగర్ డివిజన్లో అన్ని మండలాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రేపు నిర్వహించే పల్స్ పోలియో ప్రోగ్రామ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని డాక్టర్ విజయలక్ష్మి గారు తెలియజేశారు. రేపు నిర్వహించే పల్స్ పోలియో ప్రోగ్రాం లో షాద్నగర్ డివిజన్లోని మొత్తం 0 నుండి 5 సంవత్సరంల పిల్లలు 35,267 మంది కి చుక్కలు వేయను ఉన్నామని తెలియజేశారు. ఇందుకుగాను 289 బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బూతులలో 1168 మంది ఆరోగ్య సిబ్బంది, మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, 29 మంది రూట్ సూపర్వైజర్లు పనిచేస్తున్నారని, 6 మొబైల్ టీమ్లు పనిచేస్తున్నాయని, డివిజన్లో 11 ట్రాన్సిస్ట్ (బస్టాండ్ లో మరియు రైల్వే స్టేషన్లు) పాయింట్లలో బూతులు ఏర్పాటు చేశామని డాక్టర్ విజయలక్ష్మి గారు తెలియజేశారు. బూతులలో పోలియో చుక్కలు వేసుకుని పిల్లలకు 13 మరియు14 తేదీలలో ఇంటింటి సర్వే చేసి పోలియో చుక్కలు వేస్తారని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వి. విజయలక్ష్మి షాద్నగర్ డివిజన్లోని ప్రజల అందరికీ తెలియజేయడము ఏమనగా..! 0 నుండి 5 సంవత్సరంలో పిల్లలందరి కి కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు.

You may also like...

Translate »