ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైభవంగా అలయ్ బలయ్ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, అక్టోబర్ 03 :
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ హర్యానా గవర్నర్ కేంద్ర మంత్రిగా పనిచేసిన శ్రీ బండారు దత్తాత్రేయ గారిని ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు ఆయనకు శాలువా కప్పి ఘనంగా అభినందనలు తెలిపారు
అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను ఒక వేదికపై కలిపే ప్రత్యేకత కలిగినదిగా నిలుస్తోందని నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు తెలంగాణ సంప్రదాయాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అలయ్ బలయ్‌లో నిర్వహించే వేడుకలు అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు
ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవం ద్వారా సాంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని ప్రజల మధ్య ఐక్యత అనుబంధాలు బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ సామాజిక ప్రముఖులు పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.