నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

  • నాలుగు లక్షలు లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక

నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం మణిహారిక ₹10 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ రోజు అందులో భాగంగా ₹4 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సోదాలు ఏసీబీ DSP శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మణిహారిక చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇన్‌చార్జిగా ఉన్నారని ఏసీబీ వెల్లడించింది. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

You may also like...

Translate »