ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి


ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి.

  • కళాశాల ముందు నుంచి రోడ్డు వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  • పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే. రాజేష్. చేవెళ్ల, సెప్టెంబర్ 13 :

చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమిని కలుపుకొని చుట్టూ ప్రహరీ గోడని నిర్మించాలని పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన పిడిఎస్ యు నాయకులు కళాశాల చుట్టు కాంపౌండ్ వాల్ నిర్మించాలేదని ప్రిన్సిపల్ ని అడగగా కళాశాల ముందు నుంచి రోడ్డు వదలాలని కొంతమంది వ్యక్తులు కాంపౌండ్ వాల్ నిర్మించకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. కళాశాల ముందు నుంచి రోడ్డు వదిలితే విద్యార్థులు కళాశాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కానీ, బయటకు వెళ్లినప్పుడు గాని , ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పోకిరీలు ఇష్టం వచ్చే విధంగా వాహనాలు నడిపితే ఆ సమయంలో కూడా విద్యార్థులు బయటకు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ రోడ్డును వేయకుండా కళాశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని పిడిఎస్ యు విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు కొజ్జంకి జైపాల్, న్యాలట అశోక్, బొజ్జి శ్రీకాంత్, పంబలి ప్రభాస్, చక్రి, మహేష్ తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »