ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • ఉప్పొంగిన దేశభక్తి
  • భారీ ఎత్తున పాల్గొన్న పొద్దుటూరు గ్రామ ప్రజలు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జెండావందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది

గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు – చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామం నలుమూలల నుంచి ప్రజలు ఉత్సాహంగా తరలి వచ్చారు. గాలిలో గాలిపటాలు ఎగిరినట్టే, హృదయాల్లో దేశభక్తి జెండాలు ఎగిశాయి.

కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నర్సింహా పూజా కార్యక్రమాల అనంతరం కొబ్బరికాయలు కొట్టి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గ్రామ సెక్రటరీ స్వయంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా, “జై హింద్ – జై భారత్” నినాదాలు మార్మోగి ప్రాంగణం దేశభక్తి శబ్దంతో నిండిపోయింది.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబార్ ల్యాగల మల్లేశం, సిబ్బంది తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ అన్ని ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ –
“స్వాతంత్ర్యం మనకు లభించిన వరం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా. నేటి యువత దేశ భవిష్యత్తు. వారు చదువులో, క్రమశిక్షణలో, సమాజ సేవలో ముందుండాలి. మన పూర్వికులు ప్రాణత్యాగం చేసి అందించిన ఈ స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకుంటేనే నిజమైన గౌరవం చూపినట్లవుతుందని అన్నారు.

గ్రామ మాజీ వార్డు సభ్యులు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

You may also like...

Translate »