ఎల్వర్తిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

మువ్వన్నెల వెలుగులో పల్లె సీమ


జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి ప్రతినిధి, జనవరి 26 :

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎల్వర్తి గ్రామంలో దేశభక్తి జవజీవాలతో, మిన్నంటిన ఉత్సాహంతో జరిగాయి. గ్రామ పంచాయతీ నుండి పాఠశాలల వరకు, ప్రతి వీధిలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వేడుకల్లో భాగంగా మొదటగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ భాగ్యలక్ష్మి పాపారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం గ్రామ ఉన్నత పాఠశాలలో మరియు మహిళా సంఘం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఒకటవ వార్డులో వార్డు మెంబర్ శ్రీలత గారు జెండా ఎగురవేయగా, ఇతర వార్డుల్లోనూ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.5వ వార్డులో మదర్ థెరిస్సా యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అమర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నవీన్ పతాకాన్ని ఎగురవేశారు అలానే గ్రామ అనుబంధ గ్రామ కొజ్జ గూడెం పాఠశాలలో కూడా జండా ఎగుర వేసి దేశ భక్తి ని చాటారు .”రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛను గౌరవిస్తూ, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మదర్ థెరిస్సా సేవా గుణం, అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. ఐకమత్యమే మహాబలం అని చాటిచెప్పే ఇలాంటి వేడుకలు గ్రామంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయి.ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చివరగా గ్రామ పంచాయతీ లో కార్యక్రమానికి హాజరైన అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.

You may also like...

Translate »