ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మాజీ వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ ని మరియు బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ బుర్ర సూర్య గౌడ్ లను హైదరాబాద్ శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ నేపధ్యంలో
ముందస్తు అరెస్ట్ చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు ఈ సందర్బంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు ను నొక్కుతున్నాయి అని అన్నారు కౌశిక్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు వెళ్లి దాడి చేయడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దగ్గరుండి చేపించింది అని అన్నారు మాది ప్రజా పాలనా అని చెప్పుకునే ప్రభుత్వం ఇప్పటికి అయినా రైతు రుణ మాఫీ చేయాలనీ, రైతు బంధు వేయాలని అన్నారు ఆరు గ్యారంటీలతో గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు అని అన్నారు ఇప్పటికి అయినా ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతు నొక్కడం మాని పాలన పై దృష్టి పెట్టాలని కోరారు.

You may also like...

Translate »