కాల్వ పనులు వెంటనే పూర్తి చేసిరైతులను ఆదుకోవాలి

జ్ఞాన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లో రంగనాయక సాగర్ 11/6కాల్వ వద్ద గత 14 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ఆదివారం సంపూర్ణ మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 10 కోట్ల రూపాయల కేటాయిస్తే 9500 ఎకరాలు సాగులోకి వచ్చే రంగనాయక సాగర్ కాలువ పనులు తక్షణమే పూర్తి చేయాలని 14 రోజులగా ఎర్రటి ఎండలో దీక్షలు చేస్తున్న మహిళలు రైతులు గోస పట్టకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎంపీ బండి సంజయ్ లు ఎందుకు ఉన్నట్లని విమర్శించారు కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలకు అమలు చేస్తానన్న హామీలు అమలు జరిగేలా ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలన్నారు
రైతు రుణమాఫీ పూర్తి కాలేదని ఇంకా 10వేల కోట్లు
ఇవ్వలేదన్నారు రైతుభరోసా ఇవ్వలేదు, రైతు కూలీలకి 12 వేలు ఇవ్వలేదన్నారు మహిళలకు 2500లు ఇవ్వలేదన్నారు దళితులకు 12లక్షలు ఇవ్వలేదన్నారు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇంకా అమలు లేదన్నారు పెన్షన్ల పెంపు ఊసే లేదన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఊసేలేదన్నారు రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ఇల్లు లేవన్నారు ప్రభుత్వం హామీలు ఈ బడ్జెట్ లో పరిష్కారం చూపేలా ఉండాలన్నారు ఎస్సీ ,ఎస్టీలకు జనాభా ప్రతిపాదికన కేటాయింపులు చేస్తున్నారు ఖర్చు పెట్టడం లేదన్నారు బీసీ మైనారిటీ లకు ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుందన్నారు హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ రాలేదన్నారు


బయ్యారం.ఉక్కు ఊసే లేదన్నారు తెలంగాణా వాటా రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం పై డిమాండ్ చేస్తున్నామన్నారుఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ఒక్క రూపాయి అభివృద్ధికి కేటాయించలేదన్నారు ఇద్దరు మంత్రులు, ఎంపీలు ఉండి ఎందుకు అని ప్రశ్నించారుదక్షనాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెంచడంలో అన్యాయం చేస్తోంది ఉత్తరాది రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీట్లు పెంచే విధంగా వ్యవహరిస్తోందన్నారు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయాలని చూస్తోందన్నారు ప్రభుత్వ రంగం లేకుంటే రిజర్వేషన్లు ఉండవన్నారు


అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు
మనువాదాన్ని పెంచి పోషించేలా బీజేపీ వ్యవహారశైలి ఉంది కులగణకు బీజేపీ వ్యతిరేకంగా ఉందన్నారు బీసీ కులగణకు బీజేపీ ఎందుకు అడ్డుపడుతొందన్నారుసెంట్రల్ యూనివర్సిటీ 400ల ఎకరాల భూములు అమ్మాలని రాష్ట్ర సర్కారు చూస్తోందన్నారు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలన్నారు విద్యాప్రమానాలు పెంచాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో 99శాతం పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు
వాటికి సరైన కేటాయింపులు లేవన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి 15 శాతం నిధులు కేటాయించాలన్నారు రాష్ట్రంలో 50శాతం పాఠశాలలు ప్రయివేట్ రంగంలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో విద్య,వైద్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలన్నారు కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ లలో ఈ రెండు రంగాలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు తెలంగాణ లో 30వేల కోట్లు విద్యా,వైద్య రంగంలో దోపిడీ జరుగుతుందన్నారు దళిత,గిరిజన,బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు రాష్ట్రంలో, దేశంలో సోషలిస్టు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు ఈనెలాఖరు వరకు ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు చేస్తాం అడ్డమీది కూలీలుగా మారుతున్న విద్యార్థుల నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఎమ్మెల్యే ఎంపీలు గడ్డి పీకుతున్నారా అని ప్రశ్నించారు రైతులప్రయోజనాలను కాపాడుతామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు
రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు
రంగనాయక సాగర్ కాలువ సమస్య పరిష్కారం అయ్యే వరాకు అండగా ఉంటామన్నారు 10 కోట్లు ఖర్చు పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సరికాదన్నారు రైతులు తిరగబడితే ప్రభుత్వం గల్లంతు అవుతుందన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లి నీ డా.బిఆర్ అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు ఘనంగా సన్మనించారు ఈకార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గన్నేరo నర్సయ్య యువజన సంఘాల సభ్యులు రైతులు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

You may also like...

Translate »