జ్ఞాన తెలంగాణ,వర్ని : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో శుక్రవారం పలు ప్రభుత్వ పాఠశాలలో, ప్రవేట్ పాఠశాలలో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలో మ్యాట్రిక్స్ హై స్కూల్ (ఇంగ్లీష్ )లో విద్యాసంస్థలో సైన్స్ కార్యక్రమాలు నిర్వహించారు.పాతశాలలోని విద్యార్రిలు తయారు చేసిన ప్రయోగాలను విక్షించాడని ముఖ్య అతిధిగా జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్ ముఖ్య అతిధిగా హాజరు అయినారు.పాఠశాలలో విద్యార్థులు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు అధికారిని అకట్టుకొన్నాయి.. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్,ఉపన్యాస,ప్రయోగాలు. మూలకాల పోటీలు నిర్వహించిన గెలుపొందిన విజేతలకు అయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సైన్స్ అనేది ఈ రోజులలో ముఖ్యపాత్ర వహిస్తుందని తెలిపారు. సైన్స్ మనిషికి నిరంతరం పక్రియ లాంటిదని అయన అన్నారు. రాబోయే రోజులలో నేటి విద్యార్థులు కొత్త ఆవిష్కరనాలను రూపొందించి గొప్ప శాస్త్రవేతలు అవ్వాలని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.