చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి : నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో సోమవారం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైపులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి మాధర్నా చెరువు శివారులో చోటుచేసుకుంది. దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు ( 28 ) చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏర్పాటు చేసిన పైపులొ ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడే అవకాశం లేకపోవడంతో నీట మునిగి మరణించాడు విషయం తెలుసుకున్న పోలీసులు జెసిబిల సహాయంతో మృతదేహానికి వెలికి తీశారు.

You may also like...

Translate »