సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ కు బుద్దె రాజేశ్వర్ పేరు ప్రతిపాదిస్తా..

  • సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ కు బుద్దె రాజేశ్వర్ పేరు ప్రతిపాదిస్తా
  • భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
  • ఫొటోలో బుద్దె రాజేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న ఎమ్మెల్యే పోచారం.


జ్ఞానతెలంగాణ – బోధన్ :
సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో తన శక్తి మేరకు పోరాడి లిఫ్టు సాధించిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాలూర లిఫ్ట్ కు బుద్దె రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సాలూర మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.ఈ సంధర్బంగ ఆయన మాట్లాడుతూ
ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజాసేవకై, గ్రామాభివృద్దికై పాటుపడిన బుద్దె రాజేశ్వర్ అకాల మృతి అందరిని కలిచివేసిందని అన్నారు.నిరంతరం గ్రామాభివృద్దికై తనను కలుస్తూ ఎన్నో పనులు సాధించారని గుర్తు చేశారు.తనతో రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న తాను నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఒక వ్యక్తిగా కాకుండా శక్తిగా ఎదిగిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఎవరికి సాధ్యం కాదని అది ఆయనకే చెల్లిందన్నారు.ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒకరు కృషి చేయాలని కోరారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బుద్దె రాజేశ్వర్ అభిమానులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు.కార్యక్రమంలో బుద్దె రాజేశ్వరన్న సతీమణి మాజీ ఎంపీపీ బుద్దె సావిత్రి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్,పీఆర్టీయూ ఇల్తెపు శంకర్,ఏఎంసీ చైర్మెన్ చీల శంకర్,బిల్లా రామ్మోహన్ ,మంధర్న రవి,నర్సయ్య, బిలోల బీజేపీ అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »