బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగ న్యాయమూర్తులు బోధన్ కోర్టుకు అందించిన విశిష్ట సేవలను గురించి న్యాయవాదులు కొనియాడారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రాములు , ప్రధాన కార్యదర్శి కె.విద్యాసాగర్, న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి సాయి శివ, రెండవ తరగతి స్పెషల్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి, ఉపాధ్యక్షులు వి ఆర్ దేశాయ్, సంయుక్త కార్యదర్శి అప్సర్ పాష, కోశాధికారి కోటేశ్వరరావు, క్రీడా మరియు సాంస్కృతిక ఇంచార్జి డాక్టర్ సమ్మయ్య, గ్రంథాలయ కార్యదర్శి ఆరిపోద్దిన్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.