ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

- హారతులతో శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు.
- సాలూరలో శోభాయాత్ర జరుపుతున్న భక్తులు
జ్ఞాన తెలంగాణ – బోధన్ :
దేవీ శరన్నవరాత్రుల సంధర్బంగ 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాతను శుక్రవారం భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.బోధన్, సాలూర మండలాల్లో పలు గ్రామాలలో భక్తులు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.సాలూర మండలంలో అలంకరించిన ప్రత్యేక వాహనంపై దుర్గాదేవీని గ్రామంలో ఊరేగించారు. రథయాత్రకు ముందు మహిళలు హారతులతో పాల్గొన్నారు.కోలాటం ఆడి అలరించారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.