భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు

భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు


ఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట టౌన్, సెప్టెంబర్ 13:

నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్ లో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం( IFTU) జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ ప మాట్లాడుతూ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణా కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం సహజ మరణం శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పగించే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోవాలని అలోచను ఉపసంహరించుకోవాలని వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించి నిధులను దారి మళ్ళించకుండా కార్మిక సంక్షేమ కోసమే ఖర్చు చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఇవ్వకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు వేల్ఫేర్ బోర్డు ద్వారా అందించాలని కోరారు.
1996 భవనిర్మాణ కార్మికులకు కేంద్ర చట్టం నిబంధన ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ కార్మిక సంఘాల తో నియమించి వారి ఆమోదంతోనే బోర్డు నిధులు ఖర్చేయాలి కానీ నిబంధన విరుద్ధంగా అడ్వైజర్ కమిటీ నియమించకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వెల్ఫేర్ బోర్డు డబ్బులను కోట్ల రూపాయలను ఇతర రంగాలకు మళ్లించి దుబారంగా ఖర్చు చేసింది కానీ నేడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరామరాజ్యం తీసుకొస్తాం పేద బడుగు బలహీన వర్గాలను న్యాయం చేస్తాం అని చెప్పి అధికారం వచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలైన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పడం చాలా దుర్మార్గమైన చర్యని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కార్మిక సంక్షేమం కోసం ఆలోచించి భవనిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని ఖాళీగా ఉన్న ఏ ఎల్ ఓ, ఏసీఎల్, డి సి ఎల్ జూనియర్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి కేంద్రం చట్టంలో ఉన్న పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్లు గృహస్తి అడ్డాలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి ప్రాజెక్టు రోడ్లు పెద్దపెద్ద కంపెనీలు ఇటుక బట్టీలు పనిచేసే కార్మికులు వలస కార్మికులు అందర్నీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బోర్డులో నమోదు చేసి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిల్స్ ని కార్మికులకు అందించుటకు నిబంధన రూపొందించాలి తదితర డిమాండ్స్ తో సెప్టెంబరు 16 వ తారీఖున నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నను జయప్రదం చేయాలని అదే విధంగా సెప్టెంబర్ 23వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాదులో జరుగు మహా ధర్నా ను కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తమ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికుల పట్ల ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి నరసింహ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఏ. నరసింహ, నాయకులు చెన్నప్ప, డి నరసింహ, కనుక రాయుడు, హనుమంతు,తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »