ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, జనవరి 17:
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఎఐ జిల్లా కమిటీ సభ్యులు గోలి స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. అనంతరం వార్డు సభ్యులు అవుటు మురళి, బొచ్బని శిల్పరాణి లింగస్వామితో కలిసి గెలుపొందిన మహిళలు గుండమల్ల లాస్య, గుండమల్ల నాగమ్మ, కట్ట సునీతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గుండమల్ల సుమతలరామస్వామి, గుండమల్ల శ్రీరాములు, గుండమల్ల భిక్షం, అవుటు అంజయ్య. అవుటు సురేష్, సప్పిడి విజయ్, నల్ల ప్రవీణ్, నామా యాదయ్య, బొప్పని శ్రీరాములు, గాలి పాపయ్య, గుండమల్ల లింగయ్య, కృష్ణవేణి, లలిత, ప్రమీల, సునీత, నాగమణి తదితరులు పాల్గొన్నారు
