జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 31:రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి స్వామిమాల ధరించి స్కూలుకి రావడం జరిగింది. స్కూల్లో పాఠాలు బోధించే సమయంలో ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు రాములు సార్ కాలు తాకిందని ఆ విద్యార్థి ఊర్లోకి వెళ్లి స్వాములకు చెప్పడం జరిగింది. మరుసటి రోజు స్వాములందరు గుంపుగట్టుకుని స్కూల్ లొకి వెళ్లి నువ్వు ఒక దళితునివి అయ్యప్ప స్వామిని కాలుతోటి తన్నుతావా అని దాడి చేయడం జరిగింది. వాస్తవానికి కాలు తాకలేదు చెయ్యి తాకింది అని తోటి ఉపాధ్యాయులు చెప్పినా గాని వినకుండా రాములు సార్ పై దాడిచేసి అంగి, బనిను చింపడం జరిగింది అయ్యప్ప స్వాములు మాలధరించి కూడా ఇలాంటి చర్యకు పాల్పడడం ఇది ముమ్మాటికి మతోన్మాదుల దాడి అని అన్నారు కులం,మతం, భక్తి ముసుగులో మతోన్మాద శక్తులు మూక దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి దాడులను సామాజిక ప్రజాసంఘాలు, ప్రజాతంత్ర వాదులు ఖండించడంతోపాటు ప్రతిగటీంచాలని కులవివక్ష వ్యతిరక పోరాట సంఘం జిల్లా కమిటీ సభ్యులు దండు రవి కోరారు. విద్యబుద్దులు నేర్పే గురువులను పూజించాల్సింది పోయి దాడి చేయడం హేమమైన చర్య అన్నారు ప్రధానోపాధ్యాయును అవమానపరిచి అందరి కాళ్ల్లు మొక్కించుకోవడం హెయమైన చర్యలు అన్నారు. దాడిచేసిన వారందరిపైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదుచేయాలన్నారు.రాష్ట్రంలో దళితులపైన రోజురోజుకి దాడులు దౌర్జన్యంలు పెరిగి పోతున్నాయని అన్నారు.మతోన్మాద దాడులు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘాటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు,