పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, నవంబర్ 04:ఈరోజు జిల్లాలో పెండింగ్ లో 7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివ కుమార్.మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది విద్యార్థులపైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ మిస్ ఛార్జీలు విడుదల కాకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వలన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది, డబ్బులు వచ్చాకే మీ సర్టిఫికెట్స్ ఇస్తా ము అని తెలుపుతున్నారు, దీనివలన బహుజన విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉంది. కావున అలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చూడాలని విద్యార్థుల పక్షాన నిలబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ మెస్ ఛార్జిలు విడుదల చేయాలని కోరారు,ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న. ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి. రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్. నియోజకవర్గ అధ్యక్షుడు పగడాల శివతేజ. సింగపంగా వరుణ్. తదితరులు పాల్గొన్నారు,