పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు కావాలి

- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇరిగి క్రాంతి కుమార్
- వాదనలు వినిపించిన హైకోర్టు లాయర్ దున్న అంబేద్కర్
- సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన జస్టిస్ శ్రీమతి టీ మాధవి దేవి
జ్ఞాన తెలంగాణ నల్లగొండ త్రిపురారం ప్రతినిధి: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన ఇరిగి క్రాంతికుమార్ పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు కావాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తను మాట్లాడుతూ పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ 1959లో ఏర్పాటైనది అప్పటినుంచి ఇప్పటివరకు ఎస్సీ కి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ రాలేదని తెలియజేశారు ఇట్టి అంశం మీద ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిలకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదన్నారు.. 2013లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దదేవలపల్లి గ్రామపంచాయతీలో ఎస్టీ కుటుంబాలు లేనప్పటికీ రోస్టర్ పద్ధతిలో ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగిందనీ గుర్తు చేశారు.. కానీ ఎస్సీకి ఇప్పటివరకు రిజర్వేషన్ కాలేదు అందుకుగాను ఈనెల 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.. రానున్న ఎన్నికల్లో పెద్దదేవలపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వుడు కావాలని ఈనెల 27న కేసు నెంబర్ డబ్ల్యూ పి/32291/2025ఈ ను హైకోర్టు లాయర్ దున్న అంబేద్కర్ వాదనలు వినిపించడం జరిగిందన్నారు.. ఈ విషయంపై హానర్బల్ జస్టిస్ శ్రీమతి టీ మాధవి దేవి వాదనలను విని తెలంగాణ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్ కమిషనర్ కి నల్గొండ జిల్లా కలెక్టర్ కి నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారికి మిర్యాలగూడ ఆర్డీవోకి త్రిపురారం మండలం ఎంపీడీవో కి త్రిపురారం మండలం ఎమ్మార్వోకి నోటీసులు జారీ చేయడం జరిగిందనీ. పెద్ద దేవలపల్లి గ్రామపంచాయతీకి ఏ విధంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ రోజు ప్రకారం ఎలా కేటాయించారో అన్ని వివరాలు ఓటుకు నోరు ఆరవ తేదీన సమర్పించాలని నోటీసులను జారీ చేయడం జరిగిందన్నారు.. మళ్లీ కేసు విచారణ నవంబర్ ఆరో తేదీన ఉదయం 11 గంటలకు జరుగనున్నట్టు వివరాలను తెలియజేశారు….
