ఘనంగా సంక్రాంతి సంబరాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, జనవరి 17 : మండల ప్రజలు గురు శుక్రవారాల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. దేవాలయాల్లో తమకు శుభం కలగాలని పెద్దలు, చిన్నలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో హరిదాసులు తలపై అక్షయపాత్ర నెత్తిన పెట్టుకొని చేస్తూ బిక్షాటన చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహింది గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

You may also like...

Translate »