విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 18 : విద్యార్థి నులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న మెనూ వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు, వంట గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆహార వసతులు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట ఆర్టీఓ యారాల అశోత్రెడ్డి, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డిప్యూటీ తాసీల్దార్ ప్రాంక్లిన్ ఆల్బట్, ప్రధానోపాధ్యాయులు శంకర్ కుమార్ తదితరులు ఉన్నారు.