మద్యం అమ్మితే చర్యలు తప్పవు

మద్యం అమ్మితే చర్యలు తప్పవు
జ్ఞాన తెలంగాణ, చౌటుప్పల్ అక్టోబర్ 21:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్లసింగారం గ్రామంలో మునుగోడు ప్రజానేత శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశయం ఆలోచన మునుగోడు నియోజకవర్గం లో పూర్తిగా బెల్ట్ షాపులను తొలగించాలని నిర్ణయం మేరకు ఈరోజు స్వచ్ఛందంగా తాళ్లసింగారం గ్రామంలో మహిళలు స్థానిక పోలీసులు మరియు నాయకులు సహకారంతో బెల్ట్ షాప్ యజమానులకు హెచ్చరించడం జరిగినది. ఈరోజు నుండి మన గ్రామంలో బెల్టుషాపు లోమద్యము అమ్మినచో చట్టారీత్య చర్యలు తీసుకోవాలని మహిళలు పోలీసు వారిని కోరడం జరిగినది దీనికి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ మన్మధ కుమార్ స్పందించి బెల్ట్ షాపులు గ్రామంలో ఎవరు అమ్మిన నిర్వహించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ ఎస్సై లక్ష్మణ్ సార్ మహిళా సంఘం అధ్యక్షులు బడిగే కవిత దొనకొండ మంజుల సుక్క సంగీత సుజాత మండారి మార్కు డి బాలయ్య నల్ల గణేష్ ఊదరి నరసింహ దొనకొండ కృష్ణ దొనకొండ నరసింహ మట్టపల్ల శ్రీశైలం సుక్క నరసింహ మారయ్య సుక్క కృష్ణ జనార్ధన్ అంజయ్య లక్ష్మయ్య ఓలమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
